విప్లవ అక్షర క్షిపణి

విప్లవ అక్షర క్షిపణిశ్రీశ్రీ రెండక్షరాల శిఖరం
ఈ శతాబ్దపు సాహితీ
వినీలాకాశంలో
నూతన తేజస్సును ప్రసరించిన
క్రాంతి పుంజం
అలంకారాల, ఆధిపత్యాల మధ్య
బంధీ అయిన తెలుగు సరిహద్దుల
చెరసాలను బద్దలు కొట్టి
సామాన్య జన జీవనంలో
”జీవం”గా మార్చాడు
నిజమే నా ఇజం అని
అక్షరమే నా యజమానని
కామన్‌ మ్యాన్‌కు
కవిత్వం రాసే హక్కుందని
”కేక” వేసి పెద్ద గొడవే చేశాడు.
దారి మార్చాడు
”నవ కవిత” కోసం
హైవే వేశాడు
వర్ణనల నుంచి వాస్తవ
కవిత్వం సష్టించాడు
వినిపిస్తూనే ఉన్నాయి ఇంకా..
మహాప్రస్థానపు మహా విస్ఫోటనపు
అక్షర రవ్వల శబ్దాలు..!
కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా..
అనంతపు అభ్యుదయపు
విప్లవ క్షిపణుల కిరణాలు..!
ఆ ప్రయాణం ఓ అనితరసాధ్యం
ఆ ప్రభావం ఓ తీరని దాహం.
(నేడు శ్రీ శ్రీ జయంతి)
– అరుణ్‌ కుమార్‌ 9394749536