లౌకికవాదం లాల్‌సలాం అని
వెక్కి వెక్కి ఏడ్చింది
బక్క బతుకుల బంధువు ఏడని
దిక్కు దిక్కు విలపించింది.
కామ్రేడ్ ఏచూరి..సీతారాం ఏచూరి
విప్లవాలను భుజాన వేసుకుని
తిరిగిన సంచారి
అధ్యయనానికి ఊపిరులూదిన
మా ఎర్రని రేడా
శ్రమజీవులకు అండగా నిలబడిన
వేగుచుక్కవి నీవేగా
విద్యార్థి సంఘాలలో
నిర్మాణానికి ఆద్యుడవు
అసంఘటిత రంగాలెన్నింటినో
కూడగట్టిన బాధ్యుడవు
మేధస్సుకు ప్రతిరూపం ఏదని
సదస్సులన్నీ వెలవెలబోయే
కమ్యూనిస్టు భావాల యశస్సు
నేల కూలెనని విలవిలలాడే
చట్ట సభలన్నీ
చుట్టం ఒరిగిన తీరున దు:ఖించే
నీవు నడిపిన స్ఫూర్తి బాటను
ఆర్తితో కొనియాడే..
– శేషగిరి, 9573824946