– పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
– ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
నవతెలంగాణ-పటాన్‌చెరు
విద్యారంగంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం ఏర్పాటు చేసిన నియోజక వర్గస్థాయి ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యా యులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలం గాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారం గానికి అత్యధిక నిధులు కేటాయించారన్నారు. విద్యారం గాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలో, మో డల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కారొ ్పరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారన్నారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రారం భించి, ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తు న్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ప్రతిరోజు తల్లిదండ్రుల నుండి వినతి పత్రాలు వస్తున్నా యని, ఇది సంతోషకరమైన పరిణామం అన్నారు. అనం తరం పటాన ్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండ లాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 25 ఏండ్లుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ నేతతంలో ప్రతి సంవత్సరం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ప్రభ ాకర్, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ప్రజాప్రతిని ధులు, వివిధ శాఖల అధికారులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.