– మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-మునగాల
వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్‌దే అని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కోటి 56 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచాలనేదే ముఖ్యమంత్రి సంకల్పమని తెలిపారు. అరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. పల్లె నుండి పట్టణం వరకు అందుబాటులో వైద్య సేవలందించేందుకు వీలుగా ఎక్కడికక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణా సమాజం వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలివస్తున్నారన్నారని గుర్తుచేశారు. పల్లె నుండి పట్టణం వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిన ఘనత యావత్ భార త దేశంలో ఒక్క తెలంగాణా రాష్ట్రానికే దక్కిందని చెప్పారు. అనంతరం 154 మంది కళ్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఒక కోటి 54 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు 6,77,500 విలువగల చెక్కులను ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ అధ్యక్షులు సుంకర అజరు కుమార్, ఎంపీపీ ఎలకా బిందు నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ నలపాటి ప్రమీల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మెన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నిరంజన్, తహసీల్దార్ జోహార్ లాల్, పంచాయితీ రాజ్ డీఈ పాండు నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ అధికారులు, పాల్గొన్నారు.