నవతెలంగాణ-చిలుకూరు
గ్రామాల్లో విప్లవాత్మకమైన మార్పులు సంభవించినయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని బేతవోలు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు గ్రామాలు ఎలా ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాలు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. గ్రామాల్లో భూముల విలువ పెంచిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య, బజ్జూర్ వెంకటరెడ్డి, తాళ్లూరి శ్రీనివాస్, అక్కినపల్లి జానకి, రామాచారి, దొడ్డ సురేష్, అలసకాని జనార్ధన్, భాష్యం సైదులు, బెల్లంకొండ నాగయ్య, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో ఈదయ్య, వట్టికూటి ధనమూర్తి, సైదా బాబు తదితరులు పాల్గొన్నారు.