రాయల చంద్రశేఖర్‌ మృతికి విప్లవ జోహార్లు : మాస్‌లైన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథా) కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్‌ అకాల మరణం విషాకరమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఆయన మరణం పార్టీకి, కుటుంబానికి చాలా నష్టమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణానికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్టు తెలిపారు. తాత్కాలిక ఆవేశానికి గురై మరణించటం ఎంతో బాధాకరమని వివరించారు. ఈ మరణానికి బలమైన కారణాలు ఏమీ లేవనీ, కమ్యూనిస్టులు సమస్యలను ఎదుర్కొని పోరాడాలని పేర్కొన్నారు.