
పరుచూరు కుటుంబరావు తొలి వర్ధంతి నిజామాబాద్ పట్టణంలోని మాధవ నగర్ కమ్మ సంఘం కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. పరుచూరు కుటుంబరావు నేటి తరానికి ఆదర్శం రోల్ మోడల్ అని తెలిపారు.సమాజంలో అనేక మంది పుడుతారు చేస్తుంటారు.కానీ సమాజం కొంతమందిని మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. అందులో ఒకరే కామ్రేడ్ కుటుంబరావు,రైతు కుటుంబంలో పుట్టిన సమసమాజం కోసం పాటుపడ్డారు. కమ్యూనిస్టు గా ఉండడం అంటే అంత అషమాషి కాదు.
పూలబాట కాదు ముళ్లబటా పరుచూరి కుటుంబరావు సాదాసీదాగా ఒక నిబద్ధతతో కలిసిమెలిసి కమ్యూనిస్టు. నిజామాబాద్ తొలి కమ్యూనిస్టు కార్యకర్త.రైతు సంఘం జిల్లా తొలి అధ్యక్షులు గా పని చేశారు. 1975 పార్టీ జిల్లా క్లాసులు నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్లాసుల నుండి వెళ్లిన కామ్రేడ్ జక్క వెంకయ్య గారు నెల్లూరు బస్టాండ్ లో అరెస్టయ్యారు. (ఎమర్జన్సీ టైం), కమ్యూనిస్టు పార్టీ చీలిక వచ్చిన సిపిఎం పార్టీలోనే కొనసాగారు.కొడుకు పరుచూరి శ్రీధర్ సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీలో పని చేసిన ఆయన బంధువులు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికిని కుటుంబరావు గారు సిపిఎం పార్టీలోనే చివరి వరకు కొనసాగడం గొప్ప విషయం. ఈ రోజులలో ఒకే పార్టీలో కొనసాగడం చాలా అరుదు. మనం బయట చూస్తుంటాం. ఉదయం ఒక పార్టీలో సాయంత్రం మరో పార్టీలో వెళుతుంటారు. కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. సైద్ధాంతిక అంశాలపై చర్చించే వారు. కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, కమ్యూనిస్టు సీనియర్ నాయకులను సన్మనించాలని కోరిక.ఆయన పార్థివ దేహాన్ని కాలేజీ విద్యార్థులకు ఇవ్వటం మరో గొప్ప విషయం.ఆయన చూపిన మార్గంలో పనిచేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, న్యూడెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య , సీపీఎం సీనియర్ నాయకులు ఎం గంగాధరప్ప, పల్లపు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.