‘క్రాంతి ప్రధాతలు ఉపాధ్యాయులు’

'Revolutionary leaders are teachers'ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమే అని నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా అన్నారు. ఈ శక్తివంతమైన ఆయుధాన్ని ప్రజలకు అందించేవారు, మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రాంతి ప్రధాతలు ఉపాధ్యాయులు. అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు విశిష్ట స్థానం ఉంది. సాధారణంగా మన దేశంలో 5 సెప్టెంబర్‌న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మాత్రం అక్టోబర్‌ 5న జరుపుకుంటారు. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఉపా ధ్యాయుల హక్కులు, బాధ్యతలు, విద్య, నియామకం, ఉపాధి, బోధ నాభ్యసనాలకు సంబంధించి నిర్దేశించే ఉపాధ్యాయుల ప్రమా ణాలను 1966లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (యూనిసెఫ్‌), ఎడ్యు కేషన్‌ ఇంటర్నేషనల్‌(ఈఐ) సిఫార్సులను పారిస్‌లో ఆమోదించారు. దీన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు 1994 అక్టోబర్‌ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రపంచ దశ, దిశను మార్చిన ఎందరో మహనీయులు డాక్టర్లు, ఇంజనీర్లు, కవులు కళకారులు మేధావులు వ్యాపారవేత్తలు సామాజిక వేత్తలు, రాజకీయ నాయకులను అందించిన ఘనత ఉపాధ్యాయు లదే. ”మనకు విద్యకు అందించేందుకు ఉపాధ్యాయులు కావాలి, ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం ప్రపంచ ఆవశ్యకత” అనే థీమ్‌తో 2023 ప్రపంచ ఉపా ధ్యాయ దినోత్సవ వేడుకలు యునెస్కో ఆధ్వర్యంలో ఉపాధ్యా యులు ఘనంగా నిర్వహించను న్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గ కుండా, ఆ సంఖ్యను పెంచడం, ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యాలుగా ఈ థీమ్‌ ఉంది. అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి 2030 యునెస్కో ఎజెండాలోని విద్యా లక్ష్యా లను చేరుకోవడానికి సుశిక్షితులైన ఉపాధ్యాయులు అవసరం. ప్రపంచ వ్యాప్తంగా 69 మిలియన్ల ఉపాధ్యాయుల కొరత ఉంది. మానవాళి గ్లోబల్‌ టీచర్ల కొరతను ఎదుర్కొంటోంది. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ప్రపంచ మాన వాళి ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే నిపుణుల తయారీ సుశిక్షుతులైన ఉపాధ్యాయులతోనే సాధ్యం. టీచర్ల కొరతను తగ్గించ డానికి, ప్రతి విద్యాసంస్థ సాంకేతికతను ఉపయోగించుకునేలా ఉపా ధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతోపాటు, ప్రభావవంతమైన పాఠాలను అందించడానికి వారి బోధనా శైలిని మెరుగుపర్చడానికి కృషి చేయడం చాలా ముఖ్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీచర్లు ఉపయోగించేలా చూడడం ద్వారా నాణ్యమైన విద్య విద్యా ర్థులకు అందే అవకాశం ఉంది. 26.5 కోట్ల మంది విద్యార్థులు,14.9 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థగా గుర్తింపు పొందింది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద విద్యావ్యవస్థలో ఉన్న మనం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో సఫలీకృతం కాలేక పోయాం. మన దేశంలో ఉపాధ్యాయులకు అత్యధిక డిమాండ్‌ ఉంది. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రాథమిక విద్యలో వంద శాతం స్థూల నమోదు (ఎన్రోల్మెంట్‌) లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఎక్కువ మంది ఉపాధ్యాయుల అవసరం ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు. వారికి నైతిక విలువలు, మానవీయత, శాస్త్రీయ పరిజ్ఞానం పర్యావరణ పరిరక్షణ, ప్రగతిశీల భావనలు, ఆధు నిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు బోధించి రాబోయే తరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఉపాధ్యాయ నియా మకాలు చేస్తే ఉపాధ్యాయుల, అధ్యాపకుల మార్గదర్శనంలో నవ భారత నిర్మాణం జరుగుతుందని, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానం నిలుస్తుందని ఆశిద్దాం.
(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం)

– పాకాల శంకర్‌ గౌడ్‌, 9848377734