– ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, పారితోషికాల ప్రాతిపదికన పని చేసే వారికి చెల్లింపులు ఆలస్యం కాకుండా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించాల్సి ఉండగా జాప్యం జరుగుతున్నట్టు గుర్తిం చింది. వీరి పనికి మార్చి 31 వరకే పరిమితి ఉండటంతో చెల్లింపుల వద్ద ఇబ్బంది తలెత్తుతున్నట్టు గుర్తించి జులై 31 వరకు వారి కోసం కొనసాగింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులు డైలీవేజ్, పార్ట్‌టైం, ఫుల్ టైం గెస్ట్, తది తర ప్రాతిపాదికల్లో ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారందరికీ వర్తించనున్నాయి. ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ బిల్లులను అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.