ఆర్జీయూకేటీలో ఈసిఈ విభాగంలో సహాయ ఆచార్యునిగా విధులు నిర్వహిస్తున్న జి వి ఎస్ ఎస్ కే ఆర్ నాగాంజనేయులుకు, నేషనల్ ఇనిస్ట్యుట్ ఆఫ్ టెక్నాలజి కర్నాటక, “డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ స్త్రాటజీస్ అండ్ డివైసెస్ ఫర్ టెక్నికల్ ఎనాలసిస్ ఇన్ వేరియస్ మార్కేట్ పారాడైమ్స్” పై పరిశోధనకుగాను డాక్టారేట్ డిగ్రీ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ డా. జి నాగాంజనేయులుకి శనివారం అభినంధనలు తెలిపారు. డా.నాగాంజనేయులు, పరిశోధనకు సహకరించిన వైస్ ఛాన్సలర్, సహ అధ్యాపకులకు, సహయ సిబ్బందికి, ఎన్ ఐ టి గైడ్ డా నరసింహధన్ విధ్యార్ధులకు కృతజ్ఞతలు తెలియచేశారు. తన అభ్యున్నతికి జీవితాన్ని ధారపోసిన అన్నయ్య, శ్రీ జి శ్రీనివాసరావుకు ఈ డిగ్రీని అంకితం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.