కర్నాటక సంగీత కళాన్వేషణను సమర్పిస్తున రాప్సోడి మ్యూజిక్

నవతెలంగాణ – హైదరాబాద్: భారతీయ శాస్త్రీయ సంగీత కళా క్షేత్రములోతర్వాతి తరం ప్రతిభా పాటవాలను, గుర్తించడం, పోషించడం మరియు మద్దతు ఇవ్వడం పట్ల లక్ష్యంగా చేసుకున్న కళావేదిక అయిన HCL కన్సర్ట్స్, Rhapsody మ్యూజిక్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో నేడు కర్నాటక సంగీత కళాన్వేషణ యొక్క మూడవ ఎడిషన్‌ని ప్రకటించింది. భారతీయ సంగీత పోటీలలో ఒక రకమైన ‘కర్నాటక సంగీత కళాన్వేషణ’ 18 నుండి 30 సంవత్సరాల వయో సమూహములోని సీనియర్-స్థాయి కర్నాటక సంగీత కళాకారులను గుర్తించి మరియు వారిని సాధికారపరచడం పట్ల లక్ష్యంగా చేసుకొంది. ఆసక్తి ఉండి పాల్గొనదలచే అభ్యర్థులు గాత్రం, వయొలిన్, వీణ, వేణువు, మరియు సహ-వాయిద్యాల (మృదంగం/కంజీరా/ఘటం/ ఇతరముల) లో తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించవలసిందిగా ఆహ్వానించబడుతున్నారు. ఈ పోటీల మొదటి రౌండు జూన్ 1 వ తేదీ నుండి జూన్ 25 వరకూ తెరవబడి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి గాను, పాల్గొనే వ్యక్తులు https://www.hclconcerts.com/the-carnatic-quest/కి లాగాన్ కావచ్చు
ఎంతో సునిశితమైన శ్రద్ధతో రూపొందించబడిన ఫ్రేమ్‌వర్క్‌తో, కర్నాటక్ కళాన్వేషణ నాలుగు గ్రాహ్యతా రౌండ్లను కలిగి ఉంటుంది, అది ఈ సంగీత కళాకోవిదుల సమర్థతను పరీక్షిస్తుంది మరియు ప్రదర్శిస్తుంది. పోటీ యొక్క అంతిమ నిర్ధారణలో, మొత్తం ఎనిమిది మంది విజేతలు ప్రకటించబడతారు – గాత్రకచేరీలో ముగ్గురు, సహ- వాయిద్యాలలో ఇద్దరు, మరియు వయొలిన్, వీణ మరియు వేణువు విభాగాలలో ఒక్కొక్కరు. ఈ సంగీతకళాకారులు ప్రతిష్టాత్మక HCL కన్సర్ట్స్ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించి చూపే ఒక అవకాశం కూడా పొందుతారు. HCL కన్సర్ట్స్, అధిపతి శ్రీ అన్షుల్ అధికారి గారు ఇలా అన్నారు “మునుపటి ఎడిషన్ల విజయ పరంపర తర్వాత, కర్నాటక సంగీత విభావరి యొక్క మూడవ ఎడిషన్ సమర్పిస్తున్నందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ పోటీలు, నిపుణులైన మరియు ప్రతిభావంతులైన కర్నాటక సంగీత కళాకారులు భారీ సంఖ్యలో ప్రేక్షకుల ముందు తమ ప్రతిభను ప్రదర్శించి చూపడానికి ఒక వేదికను అందిస్తాయి. పోటీదారులు తమ ప్రదర్శన వల్ల మరియు బహుమతి అవకాశాల నుండి ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా, నిపుణులైన న్యాయ నిర్ణేతల నుండి అమూల్యమైన సలహా సూచనలను కూడా అందుకుంటారు.” Rhapsody మ్యూజిక్ ఫౌండేషన్ నుండి శ్రీ అనిల్ శ్రీనివాసన్ గారు మాట్లాడుతూ, “HCL కన్సర్ట్స్ మరియు Rhapsody మ్యూజిక్ ఫౌండేషన్ మధ్య భాగస్వామ్యము భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ముందుకు తీసుకువెళ్ళడం మరియు డిజిటల్ యుగంలో ప్రదర్శనాత్మక కళలను ప్రోత్సహించడమనే మా పంపక దార్శనికతకు ఒక సాక్షీభూతం వంటిది. కళాకారులు మరియు ప్రేక్షకులు ఇరువురికీ పరివర్తనాత్మక అనుభవాలను సృష్టించడానికి మేము సంఘటితంగా కలిసి సిద్ధమయ్యాము” అన్నారు. HCL కన్సర్ట్స్ మరియు Rhapsody మ్యూజిక్ ఫౌండేషన్ 2020 లో కర్నాటక్ క్వెస్ట్ మరియు 2021 లో కర్నాటక్ క్వెస్ట్ జూనియర్ ఎడిషన్‌ని వరుసగా 15-30 సంవత్సరాలు మరియు 12 నుండి 18 సంవత్సరాల వయో సమూహం లోని కర్నాటక సంగీత కళాకారుల కొరకు పరిచయం చేశాయి. ఈ రెండు చొరవ కార్యక్రమాలకు కూడా దేశవ్యాప్తంగా కర్నాటక శాస్త్రీయ సంగీత కళాకారుల నుండి విశేషమైన స్పందన లభించింది. ఈ వేదిక, విభిన్న వయో సమూహాల వ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ మరియు పెంపొందిస్తూనే, కర్నాటక సంగీత ప్రియులను ఆకర్షించే వర్చువల్ సంగీత తీర్థయాత్రగా ఉద్భవింపజేయడానికి రూపకల్పన చేయబడింది.