
వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని చించాల, వెంకటాపూర్ , కారేగాం చింతకుంట,బోరేగాం,వడ్తాల్,విట్టోలి, ముధోల్, గ్రామాల్లో పిఎసిఎస్, డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం రోజు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. రైస్ మిల్లర్ల కోతలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కేట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, పిఎసిఎస్ చైర్మన్ తీగల వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ సాయిరాం,మాజీ ఎంపిపి ఎజాజ్ ద్దిన్, బిజెపి మండల అధ్యక్షులు కోరిపోతన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంనాద్, నాయకులు సాంవ్లీ రమేష్ ,నర్సాగౌడ్ ,నిమ్మ పోతన్న, దత్తాద్రి, శివరాం, రోల్ల రమేష్ సుదర్శన్, శ్రీనివాస్, సంతోష్, గంగాధర్ ,భూమన్న,బీమెందర్, హన్మండ్లు, సాయినాథ్ , ఆయా గ్రామాల నాయకులు, రైతులు, పాల్గొన్నారు.