మండల కేంద్రానికి చెందిన జెరిపోతుల శ్రీనివాస్ ఆనారోగ్య కారణాలతో ఇటీవల మృతిచెందిన విషయం విధితమే. గురువారం కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బోనగిరి రాజేందర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తనవంతు సహాయంగా 25 కిలోల బియ్యమందజేశారు. చాట్లపల్లి అనిల్, నరేశ్, ఎండీ సలల్, వేముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.