నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
రైతులు సంప్రదాయ పంటలపై కాకుండా లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంరూరల్ మండలం గుర్రాలపాడులో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాతావరణ సమస్యల కారణంగా పంటల్లో తేమ ఉంటుందని, రైతులు ఓపికగా పంటను ఆరబెట్టి తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉండేలా చూసుకోవాలని, అప్పుడే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.