కామారెడ్డి పట్టణంలోని జిల్లా గ్రంధాలయంలో గ్రంథాలయ కార్యదర్శి అధ్యక్షతన సమాచార హక్కు చట్టం 2005, 19వ వార్షిక వారోత్సవాలను ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమానికి సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. జిల్లా గ్రంథాలయానికి వచ్చిన పాఠకులకు సమాచార హక్కు చట్టం 2005 గురించి అవగాహన కల్పించారు. అలాగే ఈ చట్టం 12 అక్టోబర్ 2005న అమలులోనికి వచ్చిందని, ఈ చట్టం వచ్చిన తర్వాత చాలామంది పేదవారికి మహిళలకు న్యాయం దొరికిందని తెలియజేశారు. అలాగే ప్రతి విద్యార్థి, ప్రతి భారత పౌరుడు ఈ చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పేద వాడికి ఇది ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయంలో జరిగే అవినీతిని, ప్రతిరోజు స్కాములను చూస్తున్నాము. ఈ చట్టం ద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. స్థానిక లైబ్రేరియన్ దిలీప్, విద్యార్థి గ్రంధాలయ సిబ్బంది,, విద్యార్థిని విద్యార్థులు, పాఠకులు, సమాచార హక్కు చట్టం రాష్ట్ర సలహాదారులు శరభని రాజేశం,శ్రీనివాస్,టి రవి,కాసర్ల లింగం, అన్వర్, మక్సూద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.