ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు కనిపించాలి

నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ప్రజలకు కనిపించే విధంగా  ఏర్పాటు చేయాలని సమాచార హక్కు చట్టం మండల అధ్యక్షులు మూల శేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా మండలంలోని  ప్రతి కార్యాలయం, రైతు భరోసా కేంద్రంలో సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానిక, తహశీల్దార్ కార్యాలయం, మండలం అగ్రికల్చరల్, వెలుగు ఆఫీస్, మండల అభివృద్ధి కార్యాలయం మండలం విద్యాశాఖ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీసు స్టేషన్, తదితరకార్యలయాల్లో బోర్డులో పౌర సమాచార అధికారి పేరు హోదా ఫోన్ నెంబర్, మొదటి అప్పీలేట్ అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబర్ చిరునామా వివరములు తెలుపూ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు పాలితులు కనుక ప్రజలకే ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ పాలనలో, పారదర్శకతను పెంపొందించి, వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలన విధానాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పౌరులకు రాజ్యాంగం కల్పించిన అధ్బుతమైన అవకాశమే సమాచార హక్కు చట్టమని తెలిపారు.