సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకోవాలి

– ఆర్టీఐ 2024 క్యాలెండర్ ఆవిష్కరణలో మహాదేవపూర్ తహశీల్దార్,ఎంపిడిఓ లు

నవతెలంగాణ – మహాదేవపూర్
సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటూ, అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని మండల తహశీల్దార్ లక్ష్మీ రాజయ్య,ఎంపిడిఓ రవిందర్ నాథ్  పిలుపునిచ్చారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో  సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం చట్టాన్ని ఆయుధంగా వినియోగించుకొని, ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలన్నారు. అవినీతి అక్రమాలను ఎదుర్కొనేందుకు యువత, రైతులు, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు నడవాలని, ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాలనలో పారదర్శకత, అధికారులు జవాబుదారితనంగా ఉండాలని సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక మల్హర్ మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మల్హర్ మండల ఉపాధ్యక్షుడు చొప్పరి రాజయ్య, ప్రధాన కార్యదర్శి శేనిగల లక్ష్మన్, కార్యదర్శి బండి సుధాకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.