సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకోవాలి..

Right to Information Act should be used as a weapon..– ఆర్టీఐ 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణలో కాటారం తహశీల్దార్ నాగరాజు
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
యునైటెడ్ ఫోరమ్ పర్ (ఆర్టీఐ) సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటూ, అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కాటారం తహశీల్దార్ నాగరాజు  పిలుపునిచ్చారు.శనివారం తహశీల్దార్ కార్యాలయంలో  సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడారు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం చట్టాన్ని ఆయుధంగా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలన్నారు.అవినీతి అక్రమాలను ఎదుర్కొనేందుకు యువత, రైతులు, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు నడవాలని,ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారితనం ఉండాలని కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రామ్మోహన్ గౌడ్,ఆర్టీఐ సభ్యుడు రాజసమ్మయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.