
జిల్లాలో సమాచార హక్కు బోర్డులు సత్వరమే అన్ని శాఖల్లో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తహసీల్దార్,ఎంపీడీఓ , మున్సిపల్ అలాగే జిల్లా కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం- 2005 శాశ్వత బోర్డులను మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా అన్ని శాఖల అధికారుల కు సూచించారు.