ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబి నేషన్ చేతులు కలిపి రూపొందిస్తున్న చిత్రమే ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతోన్న 26వ సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన వీడియోకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రైజ్ ఆఫ్ డ్రాగన్’ అనే ఎనర్జిటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయటం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీలోని పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, లియోన్ జేమ్స్, నదీషా థామస్ పాడారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తొలిసారి ఈ పాటలో డాన్స్ చేయటం విశేషం. హీరో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి ఆయన చేసిన డాన్స్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే, ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.