ఆలూరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 17కు సిద్ధమవుతున్నాడు. కొంతకాలంగా బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్న రిషబ్ పంత్ నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రిషబ్ పంత్ మ్యాచ్ ఫిట్‌నెస్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఆలూర్ గ్రౌండ్స్‌లో ఎన్‌సీఏ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రమాదానికి ముందు పంత్ తరహాలో స్వేచ్ఛగా పరుగులు వేట సాగించినట్టు ఎన్‌సీఏ వర్గాల సమాచారం. వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ మరికొద్ది రోజుల్లోనే గ్లౌవ్స్‌తోనూ సాధన చేయనున్నట్టు తెలుస్తోంది. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ అప్పట్నుంచి ఆటకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.