పెరుగుతున్న‌ కుల నేరాలు

గతేడాది ఆగస్టు 13న రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లాలోని సైలా తహసీల్‌లోని సురానా గ్రామంలో తొమ్మిదేళ్ల దళిత బాలుడు చనిపోయాడు. నీటి కుండను తాకడంతో ఇం– ఐదేండ్లలో 56 వేలకు పైగానే..
– తగ్గుతున్న నేరారోపణలు
రాజస్థాన్‌లో అణగారిన కులాలపై దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. పెత్తందారీ కులాల దూషణలు, దాడులు వారిని బాధితులుగా మిగిలిస్తున్నాయి. దీంతో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అణగారిన వర్గాల వారు జీవించాల్సిన పరిస్థితులు రాజస్థాన్‌లో ఉన్నాయి. ఇక్కడ కుల నేరాలకు సంబంధించిన దాడులు గత ఐదేండ్లలో 56 వేలకు పైగానే నమోదయ్యాయి. అక్కడి యంత్రాంగాలు, ప్రభుత్వాలు సైతం ఆశించిన రీతిలో పని చేయటం లేదు. దీంతో కుల నేరాలకు సంబంధించిన ఆరోపణలు తగ్గిపోతున్నాయి. నాసిరకమైన నివేదికలు బాధితులను తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. నేరస్థులకు ఇవి మద్దతుగా నిలుస్తున్నాయని సామాజికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– నామ్‌కే వాస్తే గా నివేదికలు
– రాజస్థాన్‌లో ఇదీ పరిస్థితి
– దళిత, ఆదివాసీ సంఘాల ఆందోళన
జైపూర్‌ : గతేడాది ఆగస్టు 13న రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లాలోని సైలా తహసీల్‌లోని సురానా గ్రామంలో తొమ్మిదేళ్ల దళిత బాలుడు చనిపోయాడు. నీటి కుండను తాకడంతో ఇంద్ర మేఘ్వాల్‌ అతని పాఠశాల ఉపాధ్యాయుడు అతనిపై దాడికి పాల్పడ్డాడని అతని కుటుంబం తెలిపింది.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. దిగ్భ్రాంతి, ఆగ్రహావేశాలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. దీంతో ఉపాధ్యాయుడి అరెస్టు జరిగింది.
రాజస్థాన్‌ పోలీసుల డేటా ప్రకారం.. 2017 నుంచి 2023 మధ్య 56,879 కేసులు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద నమోదయ్యాయి. దళితులు, ఆదివాసీలపై జరిగిన నేరాలు 2018 నుంచి2022 వరకు సగటున 22 శాతం పెరిగాయి. 2020లో 27.49 శాతంగా ఉండగా.. 2022లో నేరారోపణలు 22.38 శాతంగా ఉన్నాయి. 56,879 కుల నేరాల కేసుల్లో పోలీసులు 26,801 కేసుల్లో మాత్రమే తుది నివేదికలు నమోదు చేశారు. అంటే ఇది దాదాపు 47 శాతంతో సమానం. కేవలం 25,762 కేసుల్లో కోర్టులకు చార్జిషీట్లు సమర్పించటం గమనార్హం. అయితే, ఈ కేసులు అధికారిక సమాచారం కంటే ఎక్కువగా ఉంటాయనీ, ఎందుకంటే అనేక కేసులు కూడా నివేదించడవని సామాజికవేత్తలు, మేధావులు తెలిపారు.
రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలపై దాడులు క్రమంగా పెరగటంపై దళిత, గిరిజన సంఘాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా.. తమకు భద్రత కల్పించే అంశం అనేది ప్రశ్నార్థకంగా మారిందని వారు అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. జూన్‌ 2023 నాటికి ఈ కోర్టుల ముందు 20,492 కేసులు జాబితాలో (ఇందు కొన్ని విచారణలో) ఉన్నాయి. వీటిలో 16,020 ఎస్సీలు, 4,472 ఎస్టీలకు సంబంధించినవి కావటం గమనార్హం.
ఈ కోర్టులలో 2020లో 27.49 శాతం, 2021లో 22.26 శాతం, 2022లో 22.38 శాతంగా ఉన్నాయి. బరన్‌, సవాయి మాధోపూర్‌, జోధ్‌పూర్‌, జైపూర్‌, సికర్‌, రాజ్‌సమంద్‌, చిత్తోర్‌ఘర్‌, చురు, జలోర్‌లలోని న్యాయస్థానాలలో సాధారణ రాష్ట్ర న్యాయవాదులు ఉన్నారు. ఇతర 27 కోర్టులు రాష్ట్ర న్యాయ శాఖ నుంచి నామినేట్‌ చేయబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కలిగి ఉన్నాయి.
రాజస్థాన్‌లో 2015లో ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించినప్పటికీ.. 13 సంవత్సరాలలో మొదటిసారిగా 2023 ఆగస్టులో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలో కమిటీ సమావేశం జరిగింది. మరోపక్క, జిల్లా,బ్లాక్‌ స్థాయి కమిటీలు నిష్క్రియంగా ఉండటం గమనార్హం. జాలోర్‌లోని దళిత సామాజిక కార్యకర్త భగవానా రామ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు పర్యాటకం, మైనింగ్‌పై ఆధారపడి ఉన్నాయని అన్నారు. ”సాంప్రదాయ వృత్తులు సామాజిక సమీకరణాల ద్వారా కఠినంగా ఉంటాయి. రాజస్థాన్‌ కూడా తక్కువ మెట్రోపాలిటన్‌ ప్రాంతాలను కలిగి ఉండి, అధిక రవాణా ఖర్చులను కలిగి ఉన్నది. దీని వలన ప్రజలు తమ సాంప్రదాయ గృహాలను వదిలి వెళ్ళడం కష్టం” అని అన్నారు.