పెరుగుతున్న రష్యా చమురు ఆదాయం

– బ్లూమ్‌బెర్గ్‌
చమురు ఎగుమతుల నుండి రష్యా ఆర్జించే ఆదాయాలు గత నెలలో దాదాపు 50% పెరిగాయి. ఎందుకంటే దేశం ప్రధాన యురల్స్‌ గ్రేడ్‌ క్రూడ్‌ ధరలు పెరిగాయని, పాశ్చాత్య ఆంక్షలకుఅనుగుణంగా తయారీదారులు మారారని బ్లూమ్‌బెర్గ్‌ బుధవారం రిపోర్ట్‌ చేసింది. రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా బ్లూమ్‌బెర్గ్‌ కట్టిన లెక్కల ప్రకారం, జూన్‌ 2023లో 402.8 బిలియన్‌ రూబిళ్లు (4.5 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే, చమురు సంబంధిత పన్నుల ద్వారా రష్యా ఆదాయం గత నెలలో 590.6 బిలియన్‌ రూబిళ్లు (6.7 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. అందుబాటులోవున్న డేటా ఆధారంగా చూసినప్పుడు మొత్తం చమురు మరియు గ్యాస్‌ లాభాలు 41% పెరిగి 746.6 బిలియన్‌ రూబిళ్లు (%వి8.4 %బిలియన్‌ డాలర్ల)కు చేరుకున్నాయి. రష్యా కీలక ఎగుమతి అయిన యురల్స్‌ మిశ్రమం కోసం పెరిగిన డిమాండ్‌ ఈ అధిక ధరలకు కారణమని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. జూన్‌ పన్నులను బ్యారెల్‌కు 67.37 డాలర్ల యురల్స్‌ ధర ఆధారంగా మంత్రిత్వ శాఖ లెక్కించింది. ఇది సంవత్సరం క్రితం 53.50 డాలర్ల నుండి పెరిగింది. రష్యన్‌ చమురుపై జి-7 మరియు యూరోపియన్‌ యూనియన్‌ ప్రవేశపెట్టిన బ్యారెల్‌ ధర 60డాలర్ల పరిమితి ఉన్నప్పటికీ, ప్రపంచ బ్రెంట్‌ బెంచ్‌మార్క్‌ కు యురల్స్‌ క్రూడ్‌ కు ఇస్తున్న డిస్కౌంట్‌ తగ్గింది. పాశ్చాత్య ప్రభుత్వాలు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నంలో రష్యా సముద్రపు చమురుపై నిషేధంతో పాటు ధరల పరిమితిని విధించాయి. అదే సమయంలో రష్యన్‌ ముడి చమురును ప్రపంచ మార్కెట్లకు ప్రవహింపజేశారు. డిసెంబర్‌ 2022లో ఆంక్షలు విధించబడిన తరువాత ఫిబ్రవరి 2023లో రష్యా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ఇలాంటి పరిమితులు విధించబడ్డాయి. దానికి ప్రతిస్పందనగా, రష్యా తన ఇంధన ఎగుమతులను ఆసియాకు – ముఖ్యంగా భారతదేశం, చైనాలకు మరల్చింది. ఇక్కడ రష్యా చమురు పశ్చిమ దేశాల ధరల పరిమితి కంటే ఎక్కువగా విక్రయించబడింది. రష్యా విజయవంతంగా తన చమురు ధరపైన విధించిన పరిమితిని పక్కదారి పట్టించిందని యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు పదేపదే అంగీకరించారు. ఎందుకంటే ముడి సరుకులలో %డనబశ్‌ీ%బీదాదాపు ఏదీ%డనబశ్‌ీ%బీ ధర పరిమితికి లేదా అంతకంటే తక్కువకు విక్రయించబడలేదు. దీనితో రష్యా ఇంధన ఆదాయాలను తగ్గించడానికి పాశ్చాత్య ప్రయత్నాలకు దెబ్బ తగిలింది. 2023వ సంవత్సరంలోని మొదటి ఐదు నెలలతో పోల్చితే, ఈ ఏడాది జనవరి – మే మధ్య కాలంలో చమురు, గ్యాస్‌ ద్వారా రష్యాకు వచ్చిన ఆదాయాలు 73.5% పెరిగాయని గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో చమురు, గ్యాస్‌ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం 4.95 ట్రిలియన్‌ రూబిళ్లు (55.7 బిలియన్‌ డాలర్ల) కు చేరుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ఈ సంవత్సరం చమురు,గ్యాస్‌ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాలు 10.99 ట్రిలియన్‌ రూబిళ్లు (125 బిలియన్‌ డాలర్ల) కు చేరుకుంటాయని రష్యా అంచనా వేసింది.