
మండలంలోని బోర్గం ( కే ) గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు పసుల గంగాధర్ ఇంటిపై వాటర్ ట్యాంక్ మీద భారీ పిడుగు పడింది. ఈ పిడుగు వల్ల వాటర్ ట్యాంకుకు నాలుగు రంధ్రాలు పడ్డాయి . వాటర్ ట్యాంక్ పూర్తి గా ధ్వంసం అయింది. స్లాబు పై రెండు గుంతలు కూడా పడ్డాయి. పిడుగు పడినప్పుడు ఇంటి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. కానీ ఎవరికి నష్టం జరగలేదు. త్రుటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పిడుగు పాటు శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు గురైనట్లు తెలియజేశారు.