
మండల కేంద్రానికి చెందిన చతురస్ర పాఠశాల విద్యార్థి రిత్విక్ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ ఎన్ గిరి అభినందించారు. ఈనెల 14న చెన్నైలో జరిగిన అండర్8 విభాగం సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి సాధించాడని తెలిపారు. చిన్నతనం నుండే కరాటే శిక్షణ పొందుతూ వివిధ పోటీలలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. ఇదే స్పిరిట్ తో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి బహుమతి పంపిణీ చేశారు.