
భారీ వర్షంతో నిండుకుండలా చెరువులు కుంటలు నిండుకున్నాయని శంకరపట్నం మండలంలోని మంగళవారం కురిసిన వర్షానికి దాదాపు చెరువులన్నీ నిండి ఉన్నాయనీ, రైతులు సంతోషంతో ఉన్నారు. గత రెండు, మూడు రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు అర్కండ్ల వాగు పొంగిపొర్లుతుందని ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రజలు తెలిపారు. గత రెండు నెలల నుంచి గడిచినా వరుణుడు వర్షాలు పడక రైతంగం ఆందోళన చెందారని కానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కల్వల ప్రాజెక్టు వర్షపు నీరు సైతం నిండింది, ఈ ప్రాజెక్టు శంకరపట్నం,వీణవంక, జమ్మికుంట,ప్రాంత నుండి వర్షపు నీరు చేరి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ రైతాంగం సంతోషంతొ ఉన్నారు. సోమవారం, మంగళవారం, జోరు వాన కురిసింది దీంతో, రహదారిపై రవాణాకు సంబంధించిన సౌకర్యాలు దెబ్బతిన్నాయి,తాడికల్- ఎర్రడపల్లి,కేశవపట్నం- అంబాల్ పూర్, మక్త- ముత్తారం-ఎర్రడపల్లి, కేశవపట్నం-పాపయ్య పల్లె మధ్యలో రోడ్డు ఇబ్బందిగా మారాయి, కొన్నిచోట్ల రహదారులన్నీ గుంతలుగా జలమయామయ్యాయి, ఎడతెరిపిలేని వర్షాల తో జలాశయాల్లోకి నీరు చేరుతుంది, కొన్ని ఇల్లు కూలిపోతున్నాయి. గ్రామాల్లో మురికి కాల్వలు నిండి ఇండ్లలోకి వస్తున్నాయనీ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా, సంబంధిత అధికారులు, గ్రామాల్లో పర్యటించవలసిన అవసరం ఎంతైనా ఉందనీ సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.