టీయూటీఎఫ్ మహాసభలకు ఆర్జెడికి ఆహ్వానం 

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రంలో ఈనెల 10వ తేదీన జరిగే తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఆరవ రాష్ట్ర మహాసభలకు అతిథిగా రావాలని వరంగల్ ఆర్జేడి సత్యనారాయణ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను డీఈఓ కార్యాలయంలో టీయూటీఎఫ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాసభలకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలచ్చిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి ,రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గండ్రత్ నారాయణ, మండల అధ్యక్షులు సంజయ్ నాయకులు ఉన్నారు.