నవతెలంగాణ – రెంజల్
బ్యాంక్ లింకేజీ రుణాలను ఏ విధంగానైతే టార్గెట్ పూర్తి చేశారో, అలాగే శ్రీనిధి రుణాల టార్గెట్ ను పూర్తి చేయాలని శ్రీనిధి ఆర్ఎం రామ్ దాస్ ఐకెపి సిబ్బందికి సూచించారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో నిర్వహించిన మహిళ సమైక్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనిధి రుణాలను ఈ నెలాఖరులోపు కనీస 30 లక్షలు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రుణాలను చెల్లిస్తూ తిరిగి రుణాలు పొందాలని ఆయన సూచించారు. మార్చిలోపు శ్రీనిధి రుణాల టార్గెట్ ను పూర్తి చేయడానికి తాము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని ఐకెపి ఏపిఎం చిన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం చిన్నయ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, కోశాధికారి స్వరూప, సంయుక్త కార్యదర్శి లావణ్య, సీసీలు భాస్కర్, శివకుమార్, కృష్ణ, రాజయ్య, సునీత, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.