
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ వైద్యులను గుర్తించి ఎంతో కొంత పారితోషికం ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై బుధవారం హుస్నాబాద్ మండల కేంద్రంలో ఆర్ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీలు మాట్లాడుతూ.. ఆర్ఎంపి వైద్యులను గత పది సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించి ట్రైనింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. ట్రైనింగ్ అనంతరం ఆర్ఎంపీలను పట్టించుకున్న ప్రభుత్వం లేదన్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎంపీల పాత్ర ఉందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ రోజు కూడా ఆర్ఎంపీలను గుర్తించిన పాపాన పోలేదన్నారు. నేడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి పారితోషికం ఇస్తామని ప్రకటించడం హర్షినియమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం. పీ అధ్యక్షులు గీకురు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు సుదర్శన్ ,బంక చందు .ముంతాజ్ ,కన్నరం శీను, బింగి శ్రీనివాస్,పోతుగంటి బాలయ్య, కోడం ఆంజనేయులు, ప్రకాష్ ,కృష్ణ, పరశురాములు రమేష్ తదితరులు పాల్గొన్నారు.