రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సదస్సు..

Road Accident Prevention Awareness Conference..నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండల కేంద్రంలో పోలీస్ శాఖ మరియు మోటార్ వెహికల్స్ శాఖ ఆధ్వర్యంలో మండల ప్రజలకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ పైగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ  మరియు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధారి మండల కేంద్రంలో గాంధారి ఎస్సై ఆంజనేయులు మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి  ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదు, అలాగే మద్యం తాగి వాహనం నడపరాదు, ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, అలాగే అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని, ఎవరికైనా ఆక్సిడెంట్ అయిన వెంటనే అక్కడ ఉన్న వారు గాయపడిన వారిని హాస్పిటల్ కి పంపించి చికిత్స చేయించవలెనని పోలీసులకు లేదా 108కు సమాచారం ఇవ్వాలని, వేగం ను తగ్గించుకోవాలన, ఆటో లో ఎక్కువ మంది ప్యాసింజర్ లో నింపుకోకూడదని, రాత్రి వేళలో నిద్ర వచ్చినట్లయితే పార్కింగ్ ఏరియా లో వాహ్నన్ని పెట్టి నిద్రించవలెనని, వర్షాకాలంలో రోడ్లు స్కిడ్ అయితే కావున జాగ్రత్తలు పాటించాలని సూచించనైనది. ఇట్టి కార్యక్రమంలో వాహన చోదకులు ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు ఆటో ట్రాలీ డ్రైవర్లు గాంధారి పోలీసులు మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.