మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి ప్రతి సంవత్సరం కోట్లల్లో ఆదాయం వస్తుంది కోట్ల ఆదాయం ఉన్న పత్తి మార్కెట్ రోడ్డు కు మోక్షం ఉండదా అంటున్నారు. వాహనదారులు ఎందుకంటే అత్యధికంగా మార్కెట్ కమిటీకి ఆదాయం తీసుకువచ్చే పత్తి మిల్లులు పెద్ద షాక్కరగా రోడ్డు వైపే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం మద్యం అమ్మకాలు జరిపే వైన్స్ షాపుల ఎదుట పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. ఈ గుంతలను మట్టితో పూడ్చినప్పటికీ వర్షం నీటితో బురద మయంగా మారింది. వాహనాలు ఆ బురద మయంలో దిగబడి పోతున్నాయి. వాహనదారులకు ఈ రహదారి కష్ట రూపంగా మారింది. మద్నూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుండి పెద్ద షక్కర్గా రోడ్డు జాతీయ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మించవలసి ఉంది. ఆదాయం వచ్చే రోడ్డుకు అభివృద్ధి నోచుకోకపోవడం అత్యధికంగా వ్యాపారాలు కొనసాగే ఈ రహదారి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని వ్యాపారస్తులు వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు.