
పట్టణంలోని మామిడిపల్లి హనుమాన్ మందిరానికి ఎదురుగా ఉన్న గుంతలలో నీరు నిలవడంతో రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడిపల్లి నుండి రైల్వే స్టేషన్ వెళ్లే మార్గంలో రోడ్లపై గుంతలలో నీరు నిలిచింది. వర్షాకాలంలో ఇటువైపుగా వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు శనివారం తెలిపారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.