
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రతి ఒక్క విద్యార్థి తమ కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులకు రోడ్డు నిబంధనలు పాటించాలని తెలియజెప్పాలని హుస్నాబాద్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి అన్నారు సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై వివరించారు. వాహనం నడిపే ప్రతి ఒకరు సీటు బెల్టు, ద్విచక్ర దహనదారుడు హెల్మెట్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ చేతన్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు .