జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం వాహనదారులకు సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనాల గురించి వివరించారు. భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఆర్టీవో అధికారులు వాహనదారులకు అవగాహన కల్పించరు. ఈ అవగాహన కార్యక్రమములో జిల్లా రవాణా అధికారి కె. శ్రీనివాస్ రెడ్డి తో పాటు మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.