రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

– జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
నవతెలంగాణ సిరిసిల్ల
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ప్రజల్లో చైతన్యం రావాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు సిరిసిల్లలోని బుధవారం జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం సందర్భంగా  రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, సిరిసిల్ల లారీ ట్రాన్స్పోర్ట్ అధికారులకు  డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తల గాయాలను నివారిస్తుందని ఆయన అన్నారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్‌లు ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో గాయాల తీవ్రతను తగ్గించవచ్చని, వేగ పరిమితులను పాటించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను తగ్గించవచ్చని, మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం,చట్ట విరుద్ధం అని ఆయన అన్నారు.
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం దృష్టి మరల్చి ప్రమాదాలకు దారితీస్తుందని, ట్రాఫిక్ సిగ్నల్స్, జెబ్రా క్రాసింగ్‌లు  ఇతర నియమాలను పాటించడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచవచ్చని ఆయన అన్నారు. వాహనాన్ని సమయానికి సర్వీస్ చేయించడం, బ్రేకులు, టైర్లు మరియు లైట్లను సరిచూసుకోవడం అవసరమని,పాదచారులకు రోడ్డు దాటడానికి అవకాశం ఇవ్వడం, వారి భద్రతకు సహాయపడుతుందని,వాహనం స్టార్ట్ చేసేముందు వాహనం క్రింద, వెనుకాల ఎవరైనా పిల్లలు జంతువులు ఉన్నాయో చూసుకొని వాహన్నన్ని స్టార్ట్ చేయాలని ఆయన సూచించారు.సూచనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రాణాలను రక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో  మోటారు వాహన అధికారి జి. వంశీధర్ అసిస్టెంట్ మోటార్ వాహనాధికారి రజని, ప్రూత్విరాజ్ వర్మ,  రమ్య,సౌమ్య, ప్రశాంత్, ఎల్లేష్ లు పాల్గొన్నారు. అనంతరం డ్రైవర్లకు వాహన యజమానులకు స్వీట్స్ పంపిణి చేశారు