ప్రమాదాల నివారణకు ప్రజలు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని.. వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్టు,హెల్మెట్లను తప్పకుండా ధరించాలని ఏఎస్ఐ సంధాని కోరారు.”రోడ్డు భద్రత వారోత్సవాల” ముగింపులో భాగంగా గురువారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని శివాజీ విగ్రహ చౌరస్తా వద్ద సీఐ శ్రీనివాస్,ఎస్ఐ గంగరాజు సూచనల మేరకు స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఏఎస్ఐ సంధాని తెలిపారు.అనంతరం హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను అభినందిస్తూ పుష్పగుచ్చాలు అందించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,పోలీసు సిబ్బంది అశోక్,గణేష్ పలువురున్నారు.