రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్ఐ విజయ్ కొండ

నవతెలంగాణ – రామారెడ్డి

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని శుక్రవారం ఎస్ ఐ విజయ్ కొండ వాహనదారులకు సూచించారు. మండలంలోని గొల్లపల్లి స్టేజి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహన ద్రవ పత్రాలు కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వకూడదని సూచించారు. 65 వాహనాలపై కేసు నమోదు చేసి, జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏ ఎస్ ఐ రవీందర్, సిబ్బంది సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.