మద్నూర్ మండల కేంద్రంలో జిపి కార్మికుల రస్తారోకో


నవతెలంగాణ- మద్నూర్ 
 మద్నూర్ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ముందుగల రోడ్డుపై వివిధ గ్రామాల గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని కోరుతూ శుక్రవారం నాడు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి తమ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు గత 30 రోజుల నుండి సమ్మె చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక జేఏసీ నాయకులతో కనీసం చర్చించకపోవడం ఎందుకంటే కార్మికులు 80% మంది దళితులే కాబట్టి చిన్న చూపు చూస్తుందని ప్రభుత్వంపై సురేష్ గొండ మండిపడ్డారు కార్మికులు గొంతెమ్మ కోరికలే మీ కోరుతా లేరని సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని దీనివల్ల కార్మికులకు తీర్వమైన నష్టం జరుగుతుందని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల సహాయం అందించాలని వీరి నేల నేల వేతనం నేరుగా కార్మికుల అకౌంట్లో జమ కావాలని న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నది కావున రాష్ట్రప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కార్మిక జేఏసీ నాయకులతో చర్చించి వీరి డిమాండ్లు పరిష్కరించాలని సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం మండల అధ్యక్షులు తులసి రామ్. కార్యదర్శి మారుతి. గంగాధర్. రజాక్. అహ్మద్. సరూప. రేఖ బాయి, సారుబాయి ,వివిధ గ్రామపంచాయతీ కారోబర్లు. వాటర్ మెన్స్. ఎలక్ట్రిషన్ మ్యాన్. డాక్టర్ డ్రైవర్స్. పారిశుద్ధ్య కార్మికులు  పాల్గొన్నారు