– 10 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– ఒకటి రెండు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయడానికి కృషి చేస్తా ఎమ్మెల్యే హనుమంతు షిండే
నవతెలంగాణ- మద్నూర్
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలో గల లింబూర్, ఈలేగావ్, మదన్ హిప్పర్గా, గ్రామాల్లో 10 కోట్ల 15 లక్షల రూపాయల నిధులకు సంబంధించిన రోడ్ల నిర్మాణం వంతెనల నిర్మాణం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఆదివారం నాడు విస్తృతంగా పర్యటించి బీటీ రోడ్ల నిర్మాణానికి వంతెనల నిర్మాణానికి అలాగే ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల పరిధిలో రోడ్ల నిర్మాణాలకు అడిగిన అన్ని నిధులు మంజూరు చేస్తున్నారని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలోని లింబూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల లింబూర్ వాడి గ్రామానికి బీటీ రోడ్డు మధ్యలో వాగు పైన వంచన నిర్మాణానికి మూడు కోట్ల నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా లింబోర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి 20 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు ఇలేగావ్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఒక కోటి 80 లక్షల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు అదేవిధంగా డోంగ్లి నుండి మదన్ హిప్పర్గా వరకు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు మాదనిపర్గ గ్రామం సమీపంలో గల వాగు పైన వంతెన నిర్మాణం కోసం మూడు కోట్ల 60 లక్షల నిధులు మంజూరు చేయించి దాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. మదన్ ఇప్పటిగా గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఐదు లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు ఈ విధంగా మొత్తం 10 కోట్ల 15 లక్షల రూపాయల నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాబోయే ఒకటి రెండు సంవత్సరాల కాలంలో అన్ని రకాల అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ డి సి సి బి డైరెక్టర్ రామ్ పటేల్ లింబూర్ గ్రామ సర్పంచ్ మధుకర్ పటేల్ వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి దాత విఠల్రావు పటేల్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ డోంగ్లి మండల పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్ మండల యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ దిగంబర్ పార్టీ మాదనిపర్గా సర్పంచ్ రాజు పటేల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు గఫర్ మోఘ సర్పంచ్ సూర్యకాంత్ పటేల్ ఇలేగావ్ గ్రామ సర్పంచ్ అమిదాబి ఆ గ్రామ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు చాంద్ పాటిల్ అశోక్ పటేల్ బాబు పటేల్ జెడ్పిటిసి కుటుంబ సభ్యులు కథలయ్య పంచాయతీరాజ్ ఏఈ మధుసూదన్ గైక్వాడ్ విలాస్ తదితరులతో పాటు ఆయా గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.