
రహదారులు నిర్మిస్తారు.నిర్వహణ మరిచి పోతారు.ప్రమాదం ఏదో జరిగినప్పుడు సమీక్ష చేసి చర్యలు తీసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
అశ్వారావుపేట మండలంలో దాదాపు ప్రతీ గ్రామాన్ని కలుపుతూ నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాం లోనే బీటీ రహదారులు నిర్మించారు.అరా కొర మిగిలిన రహదారులను ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పూర్తి చేస్తున్నారు.కానీ ఈ బీటీ రోడ్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం తో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారులకు ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లను,పొదలు ను ఎప్పటికపుడు తొలగిస్తుండాలి.రెండు,మూడు,నాలుగు రోడ్లు కలిసే కూడల్లు లో ప్రమాద హెచ్చరిక లు ఏర్పాటు చేయాలి.దీన్ని ప్రతీ ఏడాది నిర్వహణ పేరుతో నిత్యం నిర్వహిస్తూ ఉండాలి.కానీ ప్రభుత్వం ఆయా శాఖలకు నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మండలంలో గతేడాది జమ్మిగూడెం,కేశప్పగూడెం గ్రామాలు నుండి గుర్రాల చెరువు రోడ్డు అనుసంధానం చేస్తూ ప్రధాన మంత్రి సడక్ యోజన రహదారులు నిర్మించారు. ఈ ఏడాది నారంవారిగూడెం – గుర్రాల చెరువును కలుపుతూ, అశ్వారావుపేట – వాగొడ్డుగూడెం రోడ్ నుండి గంగారం గ్రామానికి రహదారి నిర్మించారు. గతంలో ఎపుడో నిర్మించిన ఊట్లపల్లి – రామన్నగూడెం రోడ్ లో వాగొడ్డుగూడెం వద్ద కూడల్లు ఉన్నాయి. వీటికి రహదారి నియమాలు,ప్రమాదం హెచ్చరికలు తెలిపేలా సూచీలు ఏర్పాటు చేయాలి.ఇలాంటి ఏర్పాట్లు ఏమీ లేక పోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి.ప్రాణ నష్టం సంభవిస్తుంది. కూడల్లు ఉన్న ప్రతీ చోటా ప్రమాద హెచ్చరిక సూచీలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంతో నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని వాహన వినియోగదారులు అధికారులను కోరుతున్నారు. ఒక నెలలో ఏర్పాటు చేస్తాం – ఎ.ఇ ప్రసాద్,ఐటిడిఎ ఇంజనీరింగ్ విభాగం. నూతనంగా చేపట్టిన రహదారుల పనులు ఇంకా కొనసాగుతున్నాయి.సర్కల్ స్థాయిలో మరో కాంట్రాక్టు విభాగం పనులు చేపడతారు.ఒక నెలలో ప్రమాద నివారణ చర్యలతో పాటు నేమ్ బోర్డులను,సైడ్ బరం పనులు పూర్తి చేస్తాం.