– గత ఏడాది దేశంలో 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు
– ప్రాణాలు కోల్పోయిన 1.68 లక్షల మంది
– మితిమీరిన వేగమే ప్రధాన కారణం
– ద్విచక్ర వాహనదారులకే ఎక్కువ ప్రమాదాలు
న్యూఢిల్లీ: దేశంలోని రహదారులు ప్రాణాంతకం గా మారాయి. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించాయని ఈ నెల ప్రారంభంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలియజేశాయి. అంటే ఈ సంఖ్య తొలిసారిగా కోవిడ్‌కు ముందున్న స్థాయికి చేరుకుంది. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నాలుగో వంతు మంది 25-35 సంవత్సరాల మధ్య వయస్కులే. మితిమీరిన వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలతో పోలిస్తే మృతుల సంఖ్య మరింత అధికంగా ఉంటుందని అంచనా. ఎందుకంటే ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకే ప్రమాదాలు, మృతుల సంఖ్యను లెక్కించారు. ప్రభుత్వానికి తెలియకుండా జరిగిన ప్రమాదాలు ఎన్నో ఉంటాయి. 2015తో పోలిస్తే దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉంది. 2015లో ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2018-22 మధ్యకాలంలో 21.7 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అంతకుముందు ఐదు సంవత్సరాల కాలంతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 11% తగ్గింది. వాహనాల్లో సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణం చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
మోటారు వాహనాల చట్టానికి 2019లో సవరణలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించారు. ఎందుకంటే నిబంధనల ఉల్లంఘన కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలోని రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలు, మరణాల్లో 70%కి పైగా ఉదంతాలకు మితిమీరిన వేగమే కారణమవుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో మూడో వంతు మంది హెల్మెట్ ధరించడం లేదు. 2022లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 45% మంది ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసిన వారే. పాదచారులను ఢకొీన్న ప్రమాదాల్లో 20% మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని ఢకొీనడం వల్ల జరిగిన ప్రమాదాల్లో 16.4% మంది చనిపోయారు.
గత సంవత్సరం గోవా, లఢక్, కేరళలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కోటి మంది కంటే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు సంబంధించి బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో తక్కువ రోడ్డు ప్రమాదా లు జరిగాయి. ప్రపంచంలో జరిగిన ప్రమాదాల్లో చూస్తే మన దేశం పదో స్థానంలో ఉంది. వెనిజులియాలో ప్రతి లక్ష మంది జనాభాకు 39.4 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా ఇరాన్‌లో 17.4, దక్షిణాఫ్రికాలో 16.8 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవంతమైన బీమా క్లెయిమ్ కిసాన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిర్మల్ కుమార్‌కు మద్దతుగా బృందా కరత్ ప్రచారం చేశారు. వివిధ సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. నిర్మల్ కుమార్‌కు లభిస్తున్న బలమైన మద్దతును తగ్గించడానికి ఈ నియోజకవర్గంలో భారీగా డబ్బు ఖర్చు చేస్తూ ప్రయివేట్ బీమా కంపెనీ అనుకూల, కులతత్వ శక్తులు ముఠాగా ఉన్నాయని విమర్శించారు. బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.