అద్వాన్నంగా మారిన రోడ్లు.. ప్రమాదకరంగా మారిన గుంతలు

– ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు..
 – గుంతల మయంగా  బైపాస్ రోడ్ కూడలి..
– కొత్తగా నిర్మించిన  రోడ్ లన్ని గుంతల మాయం
 నవతెలంగాణ – భగత్ నగర్
కరీంనగర్ నగరం లోని రోడ్ల  పరిస్థితి అద్ద్వానంగా మారింది. వర్షాకాలం చినుకు పడితే చాలు చెరువులను తలపించే విధంగా తయారయ్యింది. కేబుల్  బ్రిడ్జి ను కమాన్ రోడ్ తో అనుసంధానించే క్రమంలో లక్షల రూపాయలు వెచ్చించి  నూతనంగా  రోడ్ లు వేశారు. ఐతే అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా, పలు మరమ్మతుల కారణంగా విలువైన రోడ్లు ధ్వంసం అవుతున్నాయి.
ప్రమాదకరంగా మారిన గుంతలు.. ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
హోసింగ్ బోర్డు చౌరస్తా లో ఏర్పాటు చేసిన కూడలి అనుకోని పైప్ లీకేజీ మరమ్మతు కోసం తవ్విన గుంతను పూడ్చకపోవడం తో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.నలు దిక్కుల  నుండి వచ్చి పోయే వాహన దారులే కాక ,సమీపం లోని  వైన్స్ కు వచ్చి మద్యం సేవించే మందు బాబులకు యమ పాశంగా తయారయ్యింది.దీనికి తోడు  వర్షాలు కురిస్తే గుంతల్లో నీరు నిండిపోయి దోమల బెడద కు నిలయంగా మారింది.ఇదే కాక పలు చోట్ల నీటి పంపిణి పైప్ లీకేజీ ల కారణంగా గుంతలు తవ్వడం ,పని అయ్యాక వాటిని పూడ్చకుండా వదిలెయ్యడం తో ప్రజలు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుంతల మయంగా  బైపాస్ రోడ్ కూడలి.. రోడ్లు ఘనం వేగ నియంత్రికలు శూన్యం
కేబుల్ బ్రిడ్జి పనుల్లో భాగంగా బైపాస్ రోడ్ కూడలిని అభివృద్ధి చేసి మరోసారి రోడ్ వేశారు. రోడ్ వేసి ఏడాది కాకముందే పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం ఓవర్లోడ్ తో ప్రయాణించే లారీ లు, ట్రక్ లతో పరిస్థితి మరింత జటిలంగా తయారయ్యింది. ఇప్పటికీ కూడలి కి ఇరువైపులా వేగ  నియంత్రికలు లేకపోవడం తో వాహన దారులు అతివేగం తో ప్రయాణించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ ల మరమ్మతు  చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.