రోడ్డెక్కిన వైద్య సిబ్బంది

– జీవో నెంబర్‌ ఎం.ఎస్‌ 142ను రద్దు చేయాలి
నవతెలంగాణ-కోదాడరూరల్‌
జీవో నెంబర్‌ ఎంఎస్‌ 142 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైద్య సిబ్బంది రోడ్డెక్కారు. సోమవారం పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా 142 జీవో రద్దు కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ నిరంజన్‌ , డాక్టర్‌ కల్యాణ్‌చక్రవర్తి మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖలో హేతుబద్ధీకరణ పేరుతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయాల ఎత్తివేత, సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ ఎంఎస్‌ 142 ను భేషరతుగా రద్దు చేయాలని కోరారు.142 జీవోతో వైద్య ఆరోగ్యశాఖ ఉనికి కోల్పోతుందన్నారు. ప్రజల ఇంటి ముంగిటకు ఆరోగ్య సేవలు అందిస్తున్న శాఖను నిర్వీర్యం చేయడం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.142 జీవో రద్దు స్టీరింగ్‌ కమిటీ నాయకులు యాతాకుల మధుబాబు, అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యశాఖలో ఇటువంటి జీవో గొడ్డలి పెట్టన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విజరు, డాక్టర్‌ లక్ష్మీప్రసన్న, డాక్టర్‌ ధర్మతేజ,డాక్టర్‌ నవ్య, ముక్కా శ్రీను, మహేష్‌,కష్ణ, అంజన్న, డాక్టర్‌ వైష్ణవి, డాక్టర్‌ ఫర్హీన్‌, త్రినాధ్‌, లింగయ్య, శైలజ ,ఆరోగ్య కార్యకర్తలు విజయలక్ష్మి, ఇందిరా, రాగసుధా, మంగ,మహేశ్వరి, కల్యాణి, కల్పన,మార్తా, రాధ, కళావతి, కల్పన, నీరజ, జ్యోతి,ధనమ్మ,కనకదుర్గ,వెంకటనారాయణ, శ్రీదేవి, రత్నమేరీ, సుబ్బు,సురేంద్ర,రాము,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.