దీపావళి వేళ రోకడ్ ఖాతాలు ప్రారంభం..

Rocad accounts start on Diwali..నవతెలంగాణ – భైంసా
జిన్నింగ్ ఇండస్ట్రీలకు పేరుగాంచిన బైంసా పట్టణంలో, పరిశ్రమల ఖాతాలు ప్రత్యేకంగా ఉంటాయి.. వీటిని రోకడ్ ఖాతాలంటారు. సాధారణ ఖాతా బుక్కులకు భిన్నంగా రోకడ్ ఖాతాలు ఉంటాయి. ఈ ఖాతా పుస్తకాలు విభిన్న కోణంలో ఉంటాయి. ఈ ఖాతాలను రాయాలంటే అనుభవజ్ఞులు కావాల్సిందే. మన రాష్ట్రంలోనే ప్రత్యేకంగా బైంసాలో రోకడ్ ఖాతాలు రాస్తారంటే దీనికో ప్రత్యేకత ఉంది. సంవత్సరాల తరబడి కంపెనీ లావాదేవీలు ఈ ఖాతాల్లో భద్రంగా ఉంటాయి. ప్రస్తుతం కంప్యూటర్ యుగం అయినప్పటికీ ఇప్పటికీ జిన్నింగ్ ఇండస్ట్రీలో రోకడ్ ఖాతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బైంసా లోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే నిమ్మల వార్ గంగాధర్ కు ఈ ఖాతాలు రాయడంలో 45 సంవత్సరాల అనుభవం ఉంది. గత 15 సంవత్సరాలుగా ఆయన విధులు నిర్వర్థిస్తున్నారు. అదేవిధంగా జి కిషోర్ అనే వ్యక్తికి 33 సంవత్సరాలుగా రోకడ్ ఖాతాలు రాస్తున్నారు. గత ఏడు సంవత్సరాలుగా ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నాడు. 33 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నానని, మరాఠీ భాషలో ఈ ఖాతాలు రాస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. విభిన్న రీతిలో రోకడ్ ఖాతాలు రాస్తూ, వీరు తమ వృత్తి నిర్వహణలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.