ఇదనీ కాదు అదనీ కాదు
ఇటనీ లేదు ఆటనీ లేదు
అన్నీ తానే అయి నిలబడ్డ ‘అంగట్లో’
మనిషి ఇవ్వాళ ఓ తరాజు
మంచో చెడో తూచేందుకు రాళ్ళు లేవు
అటో ఇటో తేల్చేందుకు బారోమీటర్ లేదు
మనిషి పడుతున్న యాతన
మనసు పడుతున్న రోదన
కొలిచేందుకు యంత్రాలు లేవు
చూపులు కరువై కళ్ళు ఎడారులై
మాటలు అరుదై
సంభాషణలు
ప్రవాహంలేని తీరాలైనాయి
ఇవ్వాళ మనిషి
పచ్చదనం ఇంకిపోయిన మొక్క
ఆకాశహర్మ్యాల నీడల్లో
జీవంలేని ఇసిరె
రూపం లేని రాతిశిల
శిలకు తడి అంటదు
చెమట పట్టదు
– వారాల ఆనంద్, 9440501281