
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళ సంఘం ఆధ్వర్యంలో రేషన్ షాపులలో కేరళ ప్రభుత్వం ఇస్తున్న మాదిరి పద్నాలుగు రకాల సరుకులు తెలంగాణలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని పంతంగి గ్రామ శాఖ మహిళా కార్యదర్శి రొడ్డ సోని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని ఆమె అన్నారు.అనంతరం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు.