రొడ్రిగస్‌ ఆల్‌రౌండ్‌ షో

– బంగ్లాపై భారత్‌ గెలుపు
మీర్పూర్‌ : జెమీమా రొడ్రిగస్‌ (86, 4/3) ఆల్‌రౌండ్‌ షోతో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత మహిళల జట్టు 108 పరుగుల తేడాతో గెలుపొందింది. హర్మన్‌ప్రీత్‌ (52), మంధాన (36), జెమీమా రాణించగా తొలుత భారత్‌ 228/8 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లాదేశ్‌ 35.1 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 106/3తో గెలుపు దిశగా సాగిన బంగ్లాదేశ్‌.. జెమీమా మాయతో14 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం జరుగనుంది.