రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’. శుక్రవారం మేకర్స్ థర్డ్ సింగిల్- ‘జిక్కీ..’ సాంగ్‌ని రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ మెస్మరైజింగ్ నెంబర్‌ని కంపోజ్ చేశారు. గీత రచయిత వనమాలి రాసిన ఈ పాటను కార్తీక్, రమ్య బెహరా అద్భుతంగా పాడారు. బందా మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట రొమాంటిక్ మెలోడీగా అందర్నీ అలరిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది.