రొమాంటిక్‌ సిల్క్‌ శారీ

వాసుదేవ్‌ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సిల్క్‌ శారీ’. చాహత్‌ బ్యానర్‌ పై కమలేష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. దీనికి టి. నాగేందర్‌ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా ప్రసాద్‌ ల్యాబ్స్‌లో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్‌, హీరో శ్రీకాంత్‌, శివాజీ రాజా, ఉత్తేజ్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కమలేష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘ఒక మంచి మూవీతో టాలీవుడ్‌లోకి నిర్మాతగా అడుగు పెట్టడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు.’ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచే అందరి దష్టిని ఆకర్షిస్తోంది. ఇదొక సరికొత్త రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. హీరో వాసుదేవ్‌ రావు కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ప్రొడ్యూసర్‌ కమలేష్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు’ అని దర్శకుడు టి.నాగేందర్‌ చెప్పారు.’ఈ సినిమాతో హీరోయిన్‌గా మంచి పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరోయిన్‌ రీవా చౌదరి చెప్పారు.