హైదరాబాద్ : ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ (ఐఎసిజి) మల్టీమీడియా కాలేజ్‌కు ”రూకీస్ సర్టిఫైడ్ స్కూల్”గా ప్రపంచ గుర్తింపు పొందిందని ఐఎసిజి వ్యవస్థాపకుడు, ఎండి రామ కృష్ణ తెలిపారు. శనివారం మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది క్రియేటివ్ ఇండిస్టీస్‌లో కళాకారులను సిద్దం చేయడానికి ఉత్తమ గుర్తింపు అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ది రూకిస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అని తెలిపారు. మీడియా పరిశ్రమలో పని చేయాలనుకునే వారికి సంబంధిత శిక్షణ విద్యను అందించే పాఠశాలలకు ఈ అక్రిడేషన్ ఇస్తుందన్నారు. తమ సంస్థ గేమింగ్, యానిమేషన్, విఎఫ్‌ఎక్స్, ఆర్ట్ అండ్ డిజైన్ ఎడ్యుకేషన్‌తో పాటు అనేక విజయవంతమైన చిత్రాలకు పని చేశామన్నారు.